జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉంది: నక్కా ఆనందబాబు

ABN , First Publish Date - 2021-05-30T18:08:25+05:30 IST

జడ్జి రామకృష్ణపై కుట్ర జరుగుతోందని, చిత్తూరు జైల్లో ఉన్న ఆయనకు ప్రాణహాని ఉందని నక్కా ఆనందబాబు అన్నారు.

జడ్జి రామకృష్ణకు ప్రాణహాని ఉంది: నక్కా ఆనందబాబు

అమరావతి: జడ్జి రామకృష్ణపై కుట్ర జరుగుతోందని, చిత్తూరు జైల్లో ఉన్న ఆయనకు ప్రాణహాని ఉందని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ  రామకృష్ణను అంతమొందించడానికే అపరిచిత వ్యక్తిని బ్యారెక్‌లో ఉంచారా? అని ప్రశ్నించారు. రామకృష్ణ విషయంలో ప్రభుత్వ వైఖరి చూస్తుంటే నిజమే అనిపిస్తోందన్నారు. రామకృష్ణ కుమారుడి లేఖను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు. జస్టిస్ నాగార్జునరెడ్డి సోదరుడు పవన్ కుమార్ రెడ్డి హత్యకేసులో నిందితుడైతే.. అతని పేరు తీసేయాలని రామకృష్ణపై ఒత్తిడితెచ్చారని, అది మనసులో పెట్టుకొనే రామకృష్ణపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందని నక్కా ఆనందబాబు ఆరోపించారు.

Updated Date - 2021-05-30T18:08:25+05:30 IST