కార్పొరేషన్ల పేరుతో jagan వంచించారు: Nagul Meera
ABN , First Publish Date - 2021-07-19T22:39:35+05:30 IST
బడుగు, బలహీనవర్గాల యువతను మోసగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు కార్పొరేషన్ల పేరుతో పెద్దలనూ వంచించారని తెలుగుదేశం అధికారప్రతినిధి నాగుల్ మీరా అన్నారు.
అమరావతి: బడుగు, బలహీనవర్గాల యువతను మోసగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు కార్పొరేషన్ల పేరుతో పెద్దలనూ వంచించారని తెలుగుదేశం అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బలమైన కార్పొరేషన్లు,ఇతర విలువైన పదవులను ముఖ్యమంత్రి తనవర్గానికి ఇచ్చుకున్నారని మండిపడ్డారు.ఎందుకూ పనికిరాని, కార్యాలయాలు ఎక్కడో తెలియని కార్పొరేషన్లను మాత్రం బడుగు, బలహీన వర్గాలకిచ్చారని చెప్పారు. తమ వర్గాలకే న్యాయం చేసుకోలేని కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా ఉండటం బలహీనవర్గాలకు అవసరమా? అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడి హాయాంలో బీసీ ఫెడరేషన్లు ఏర్పాటుచేసి, ఒక్కో ఫెడరేషన్‌కు రూ.40కోట్ల నిధులు కేటాయించారని వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమంత్రి 135 కార్పొరేషన్లకు కలిపి కూడా రూ.40కోట్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని మూడు భాగాలు చేసి ముగ్గురు రెడ్లను నియమించిన జగన్మోహన్‌రెడ్డి, ఏ బలహీనవర్గం వ్యక్తికీ ఏ ఒక్కభాగాన్నైనా ఎందుకు ఇవ్వలేదు? అని నాగుల్ మీరా నిలదీశారు.