బాత్‌రూమ్‌ సీన్‌ రిపీటవుద్ది జాగ్రత్త!: బ్రహ్మం

ABN , First Publish Date - 2021-03-21T09:46:59+05:30 IST

‘పొలంలో వేసే డ్రామాలు కోర్టులో కుదరవు కరకట్ట కమల్‌ రెడ్డీ! షర్మిలా తో కుమ్మక్కై జగన్‌రెడ్డి పరువు గంగలో కలపటానికే నువ్వు చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టావని తేలిపోయింది’’ అంటూ టీడీపీ రాష్ట్ర

బాత్‌రూమ్‌ సీన్‌ రిపీటవుద్ది జాగ్రత్త!: బ్రహ్మం

‘‘పొలంలో వేసే డ్రామాలు కోర్టులో కుదరవు కరకట్ట కమల్‌ రెడ్డీ! షర్మిలా తో కుమ్మక్కై జగన్‌రెడ్డి పరువు గంగలో కలపటానికే నువ్వు చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టావని తేలిపోయింది’’ అంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ట్వీట్‌ చేశారు. ‘‘మంత్రి పదవి ఇవ్వనందుకు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ జగన్‌రెడ్డికి చీవాట్లు పడేలా కేసులు వేసి, లోలోపల ఆనందపడుతున్నావన్న విషయం తాడేపల్లి ప్యాలె‌స్‌కు లీకైతే.. మరో బాత్‌ రూమ్‌ బాబాయి సీన్‌ రిపీట్‌ అవుతుంది జాగ్రత్త’’ అ ని బ్రహ్మం హెచ్చరించారు. టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘కరకట్ట కమల్‌ రెడ్డిని మంగళగిరి ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి. పొలం గట్లపై పాములు పట్టుకుని వేసే డ్రామాలు కోర్టులో వేస్తే ఎలా... కరకట్ట కమల్‌?’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-21T09:46:59+05:30 IST