బెంగళూరులో హత్య, రాపూరులో పూడ్చివేత

ABN , First Publish Date - 2021-02-01T08:33:53+05:30 IST

బెంగళూరులో కిడ్నాప్‌, హత్య.. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో పూడ్చివేత.. మృతుడు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్‌సింగ్‌ సమీప బంధువని తెలిసింది.

బెంగళూరులో హత్య, రాపూరులో పూడ్చివేత

హతుడు మాజీ సీఎం ధరమ్‌ సింగ్‌ బంధువు?

రాపూరు, జనవరి 31: బెంగళూరులో కిడ్నాప్‌, హత్య.. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో పూడ్చివేత.. మృతుడు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్‌సింగ్‌ సమీప బంధువని తెలిసింది. దీంతో కర్నాటక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పహారా కాస్తున్నారు. పోలీసులందించిన ప్రాథమిక సమాచారం మేరకు.. బెంగళూరుకు చెందిన సిద్ధార్థ్‌ దేవేందర్‌ సింగ్‌ (27) ఈ నెల 19న అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు బెంగళూరులోని అమృతవెల్లి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతడి అదృశ్యం వెనుక తిరుపతికి చెందిన వినోద్‌ ప్రమేయమున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా కిడ్నాప్‌ అనంతరం హత్య చేసి మృతదేహాన్ని వెలుగోను గ్రామ అడవుల్లో పూడ్చివేసినట్లు చెప్పాడు. దీంతో బెంగళూరు పోలీసులు ఇక్కడికొచ్చి మృతదేహాన్ని గుర్తించారు. అనుమానితుడితోపాటు.. మృతుడి తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం ఇక్కడికి రానున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-02-01T08:33:53+05:30 IST