కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు: మంద కృష్ణ

ABN , First Publish Date - 2021-07-13T20:19:26+05:30 IST

సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు.

కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు: మంద కృష్ణ

చిత్తూరు: సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ మృతిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కత్తి మహేశ్ స్వగ్రామంలో సోమవారం అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. రోడ్డు ప్రమాదంలో కారు కుడిభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయినప్పటికీ డ్రైవింగ్‌ చేస్తున్న సురేశ్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడని.. ఎడమ వైపు కూర్చొన్న మహేశ్‌కు తీవ్ర గాయాలవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రెండు, మూడేళ్లుగా అతను వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతో  చాలా మంది శత్రువులు ఏర్పడ్డారని, గతంలో ఆయనపై జరిగిన దాడులు, కొన్ని సంఘటనలు దీనికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయన్నారు. నిజాయితీగల అధికారితో ప్రమాద ఘటనపై దర్యాప్తు జరిపించాలని ఏపీ సీఎం జగన్‌ను మందకృష్ణ కోరారు.   

Updated Date - 2021-07-13T20:19:26+05:30 IST