ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్‌ రేట్లను తగ్గించాలి: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2021-11-05T21:27:30+05:30 IST

అప్పులు తెచ్చే పాలకులను ప్రజలు హర్షించరని ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్‌ రేట్లను తగ్గించాలి: ఎంపీ రఘురామ

న్యూఢిల్లీ: అప్పులు తెచ్చే పాలకులను ప్రజలు హర్షించరని ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని స్ఫూర్తితో పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్రాలు సుంకాలు తగ్గించాయన్నారు. ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్‌ రేట్లను తగ్గించాలన్నారు. రాష్ట్రంలో లిక్కర్‌ విక్రయాల్లో డిజిటల్‌ పేమెంట్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఏపీలో మద్యం అమ్మకాల లావాదేవీలపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశానన్నారు. డిజిటల్‌ విధానంలో లావాదేవీలు జరిగే విధంగా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరానన్నారు. కస్టడీ సందర్భంగా తనను హింసించిన ఘటనపై తన కుమారుడు.. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ ఇంకా విచారణకు రాలేదన్నారు. చాలా సార్లు ప్రస్తావించినా విచారణకు రావడం లేదన్నారు. ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితేంటని రఘురామకృష్ణంరాజు అన్నారు.

Updated Date - 2021-11-05T21:27:30+05:30 IST