ఉక్కు కోసం మరో మహా ఉద్యమం

ABN , First Publish Date - 2021-03-14T09:24:47+05:30 IST

విశాఖ ఉక్కుని సంరక్షించుకోవడానికి మరోసారి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగుసేన జాతీయ అధ్యక్షుడు, నటుడు, దర్శక, నిర్మాత పి.సత్యారెడ్డి అన్నారు.

ఉక్కు కోసం మరో మహా ఉద్యమం

త్వరలోనే విశాఖలో భారీ బహిరంగ సభ: సినీ నటుడు పి.సత్యారెడ్డి


గుంటూరు తూర్పు, మార్చి13: విశాఖ ఉక్కుని సంరక్షించుకోవడానికి మరోసారి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగుసేన జాతీయ అధ్యక్షుడు, నటుడు, దర్శక, నిర్మాత పి.సత్యారెడ్డి అన్నారు. శనివారం గుంటూరులో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదంతో సృష్టికర్త అమృతరావు స్ఫూర్తిగా జిల్లా నుంచే ఉద్యమం ప్రారంభమవ్వాలని అన్నారు. ఉక్కును కాపాడేందుకు ఆంధ్రులతో కలసి పోరాడతామన్న తెలంగాణ మంత్రి కేటిఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం జరగుతున్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు, తెలుగుసేన మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. ఉక్కు పోరుకు మద్దతుగా  ‘ఉక్కు సత్యాగ్రహం’ పేరిట ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు, ఆ చిత్రంలో అమృతరావు పాత్రను ఆయన మనవడు మోహన్‌గాంధీ పోషిస్తారన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా త్వరలో విశాఖలో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ‘‘మా తాతా ఉద్యమం చేస్తున్నప్పుడు తొలివారం ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత ఉద్యమం ప్రతి పల్లెకు విస్తరించింది. ఉక్కును కాపాడేందకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఆ ఉద్యమానికి సీఎం జగన్‌ నాయకత్వం వహించాలి. ఇటువంటి నిర్ణయాలతో బడుగు, బలహీన వర్గాలు రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది’’ అని అమృతరావు మనవుడు మోహనగాంధీ అన్నారు.

Updated Date - 2021-03-14T09:24:47+05:30 IST