అమ్మే అమ్మేసింది!

ABN , First Publish Date - 2021-02-26T08:37:10+05:30 IST

కాసుల కోసం కన్నకూతురిని బాలిక అని కూడా చూడకుండా తల్లే అమ్మేసింది...బాలికను వివాహం చేసుకున్న వ్యక్తి లైంగికదాడికి దిగగా చిన్నారి భయంతో పరుగులు తీయడంతో ఘటన వెలుగుచూసింది...

అమ్మే అమ్మేసింది!

  • బాలికను పెళ్లాడి లైంగికదాడికి యత్నించిన వ్యక్తి
  • గ్రామస్థుల చొరవతో వెలుగులోకి..

విడవలూరు, పిబ్రవరి 25: కాసుల కోసం కన్నకూతురిని బాలిక అని కూడా చూడకుండా తల్లే అమ్మేసింది...బాలికను వివాహం చేసుకున్న వ్యక్తి లైంగికదాడికి దిగగా చిన్నారి భయంతో పరుగులు తీయడంతో ఘటన వెలుగుచూసింది.  నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గిరిజనకాలనీకి చెందిన ఓ తల్లి పెద్దకుమార్తె చికిత్సకు డబ్బు కోసం తన 11 ఏళ్ల చిన్న కుమార్తెను  రెండు రోజుల  క్రితం అమ్మకానికి పెట్టింది. ఆ బాలికను నెల్లూరులోని కొత్తూరులో నివాసం ఉంటున్న  50  ఏళ్ల వ్యక్తి రూ.10వేలకు కొనుగోలు చేశాడు. బాలికను వివాహం చేసుకుని బుధవారం దంపూరు తీసుకు వచ్చాడు. అత్తవారింట్లో ఆ వ్యక్తి బాలికపై లైంగిక దాడికి దిగటంతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ బయటకి పరుగులు తీసింది. చుట్టుపక్కల వారు అక్కడి చేరుకుని బాలికని రక్షించారు. కన్నతల్లి చేసిన దాష్టీకాన్ని తెలుసుకుని  గ్రామస్థులు నివ్వెరపోయారు.  సచివాలయ సిబ్బంది గురువారం  ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అంగన్‌వాడీ సిబ్బంది బాధితురాలిని నెల్లూరులోని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.  విషయాన్ని ఐసీడీఎస్‌ అధికారులు గోప్యంగా ఉంచాలని ప్రయత్నాలు చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Updated Date - 2021-02-26T08:37:10+05:30 IST