మోదీ దేశానికి పట్టిన దెయ్యం

ABN , First Publish Date - 2021-05-02T09:06:19+05:30 IST

‘మోదీ దేశానికి పట్టిన దెయ్యం. ఆయన అవలంభిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై మేడే స్ఫూర్తితో, ఏకోన్ముఖంగా ఉద్యమాలకు సమాయత్తం కావాలి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

మోదీ దేశానికి పట్టిన దెయ్యం

కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు సమాయత్తం కావాలి

రాష్ట్ర ప్రజలకు మేడే శుభాకాంక్షలు: రామకృష్ణ


అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): ‘‘మోదీ దేశానికి పట్టిన దెయ్యం. ఆయన అవలంభిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై మేడే స్ఫూర్తితో, ఏకోన్ముఖంగా ఉద్యమాలకు సమాయత్తం కావాలి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్‌ దగ్గర పార్టీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మేడేను పురస్కరించుకుని కరోనా నిబంధనలను పాటిస్తూ శనివారం ఆయన అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా కార్మిక, రైతు సంఘాలు తమ ప్రయోజనాల పరిరక్షణకు పోరాటం చేస్తున్నాయని చెప్పారు. మోదీ పాలనలో దేశమంతా ప్రమాదంలో పడిపోయిందన్నారు. కరోనా వేళ ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం కష్టమైపోయిందన్నారు. వ్యాక్సిన్‌  కావాలంటే క్యూ కట్టాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. కరోనాతో మృతి చెందిన రోగుల మృతదేహాలు స్మశానవాటికల దగ్గర బారులు తీరుతున్నాయన్నారు. దీనికి మోదీ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో ఇంటర్‌, టెన్‌ ్త పరీక్షలను వాయిదా వేయాలని, విద్యార్థుల భవిష్యత్తు రీత్యా సఎం జగన్‌  వెనక్కి తగ్గాలని రామకృష్ణ సూచించారు.

Updated Date - 2021-05-02T09:06:19+05:30 IST