బంగ్లాదేశ్‌కు మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్‌లు
ABN , First Publish Date - 2021-09-03T09:48:57+05:30 IST
భారత నౌకా దళానికి చెందిన ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసల్ ఐఎన్‌ఎస్ సావిత్రి రెండు 960 ఎల్‌పీఎం మెడికల్ మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లతో గురువారం బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రామ్ హార్బర్‌కు చేరుకుంది.

చట్టోగ్రామ్ హార్బర్‌కు చేర్చిన ఐఎన్‌ఎస్ సావిత్రి
విశాఖపట్నం, సెప్టెంబరు 2: భారత నౌకా దళానికి చెందిన ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసల్ ఐఎన్‌ఎస్ సావిత్రి రెండు 960 ఎల్‌పీఎం మెడికల్ మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్లతో గురువారం బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రామ్ హార్బర్‌కు చేరుకుంది. బంగ్లాదేశ్‌లో కొవిడ్ విజృంభించి ఎక్కువ మంది ఆస్పత్రుల పాలవుతున్న కారణంగా వారికి ఆక్సిజన్ అందించేందుకు భారత్ ఈ మొబైల్ ప్లాంట్‌లను పంపింది. బంగ్లాదేశ్ నేవీ కమాండింగ్ ఆఫీసర్ వీటిని స్వాధీనం చేసుకుని, ఢాకా మెడికల్ కళాశాలకు తరలించారు. ఈ సందర్భంగా ఐఎన్‌ఎస్ సావిత్రి నౌకా సిబ్బంది, బంగ్లాదేశ్ నేవీ సిబ్బంది వృత్తి పరమైన అంశాలపై చర్చించుకున్నారు.