ఎమ్మెల్సీ వంశీకృష్ణ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయి: జనసేన నేతలు

ABN , First Publish Date - 2021-12-19T22:30:40+05:30 IST

జ్ఞానానంద ఆశ్రమ గోశాలపై ఎమ్మెల్సీ వంశీకృష్ణ వ్యాఖ్యలు బాధ్యత రహితంగా ఉన్నాయి..

ఎమ్మెల్సీ వంశీకృష్ణ వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయి: జనసేన నేతలు

విశాఖపట్నం: జ్ఞానానంద ఆశ్రమ గోశాలపై ఎమ్మెల్సీ వంశీకృష్ణ వ్యాఖ్యలు బాధ్యత రహితంగా ఉన్నాయి. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని జనసేన నేతలు మూర్తి యాదవ్, పి వి ఎస్ఎన్ రాజు అన్నారు. ఆదివారం గోశాలను సందర్శించిన విలేకరులతో మాట్లాడుతూ.. జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల మరణాలపై ఏబీఎన్ కథనాలకు అధికార యంత్రాంగం స్పందించిందన్నారు. ఏబీఎన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కథనాల ప్రసారంతోనే అధికార పార్టీ నేతలు, మంత్రులు గోశాలకు వచ్చారన్నారు.


గోవుల మృతిపై స్పందించకుండా భూవివాదాలు, స్వామిజీని అరెస్ట్ చేయాలని, సంబంధం లేని విషయాలను వంశీకృష్ణ మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన  గోశాలలకు..180 ఆవులను ఎందుకు తరలించలేదో వంశీ కృష్ణ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గోశాలకు వచ్చి.. భూములు కోసం మాట్లాడం ఏమిటి? అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ సమస్యలు ఉంటే బయట మాట్లాడుకోవాలని హితవు పలికారు. ఈ గోవులను వసతులు లేని ఈ ఆశ్రమంలోనే ఉంచి ఆశ్రమ భూములను కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని జనసేన నేతలు మండిపడ్డారు. 

Updated Date - 2021-12-19T22:30:40+05:30 IST