మాన్సస్ ట్రస్ట్‌లో ఎన్నో అవకతవకలు: ఎమ్మెల్సీ సురేష్ బాబు

ABN , First Publish Date - 2021-06-22T23:38:37+05:30 IST

మాన్సస్ ట్రస్ట్‌లో ఎన్నో అవకతవకలు జరిగాయన ఎమ్మెల్సీ సురేష్ బాబు

మాన్సస్ ట్రస్ట్‌లో ఎన్నో అవకతవకలు: ఎమ్మెల్సీ సురేష్ బాబు

అమరావతి: మాన్సస్ ట్రస్ట్‌లో ఎన్నో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్సీ సురేష్ బాబు తెలిపారు. ఎవరికీ సమాచారం లేకుండా క్షత్రియ సమాజం పేరుతో పత్రిక ప్రకటన ఇవ్వడాన్ని సురేష్ బాబు ఖండించారు. అశోక్ గజపతిరాజు రాజు చైర్మన్‌గా ఉన్నప్పటి నుంచే ట్రస్ట్‌లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఆయన ఆరోపించారు. తన అన్న కూతురుని మాన్సస్ ట్రస్ట్ చైర్మన్‌గా చేస్తే అశోక్ గజపతిరాజు ఓర్వలేకపోయారని సురేష్ బాబు మండిపడ్డారు. టీడీపీ హయాంలో చంద్రబాబు విజయనగరంలో ఒక్క అశోక్ గజపతిరాజుకు తప్ప ఎవరికీ పదవులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. మాన్సస్ ట్రస్ట్‌లో ఎన్ని అవకతవకలు జరిగాయో అవన్నీ త్వరలోనే బయటకు వస్తాయని, అవకతవకలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్సీ సురేష్ బాబు అన్నారు. 


Updated Date - 2021-06-22T23:38:37+05:30 IST