పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన ఎమ్మెల్సీ మాధవ్

ABN , First Publish Date - 2021-01-21T22:15:21+05:30 IST

దేవాలయాలపై దాడుల వెనక బీజేపీ ఉందంటూ ఏపీ డీజీపీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్.. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్

పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన ఎమ్మెల్సీ మాధవ్

గుంటూరు: దేవాలయాలపై దాడుల వెనక బీజేపీ ఉందంటూ ఏపీ డీజీపీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్.. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. పోలీసుల కళ్లుగప్పి లోనికి దూసుకు వెళ్లారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను, కార్యకర్తలను అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ఉన్నారు. 


Updated Date - 2021-01-21T22:15:21+05:30 IST