సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జిగా బుద్దా
ABN , First Publish Date - 2021-03-21T09:51:29+05:30 IST
తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

విజయవాడ, మార్చి 20(ఆంధ్రజ్యోతి): తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నియమితులయ్యారు. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ అధిష్ఠానం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ ముఖ్య నేతలను ఇన్‌చార్జిలుగా నియమిస్తోంది.