ఎమ్మెల్యే ఉదయభానును అడ్డుకున్న టీ-పోలీసులు

ABN , First Publish Date - 2021-07-12T07:58:56+05:30 IST

పులిచింతల ప్రాజెక్టు సందర్శన కోసం తెలంగాణ సరిహద్దుమీదుగా వెళ్లేందుకు ప్రయత్నించిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభానును సూర్యాపేట జిల్లా బుగ్గమాధవరం వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.

ఎమ్మెల్యే ఉదయభానును  అడ్డుకున్న టీ-పోలీసులు

పులిచింతలకు అనుమతి నిరాకరణ

పడవలో ప్రయాణించి ప్రాజెక్టు వద్దకు


అచ్చంపేట/జగ్గయ్యపేట, జూలై 11: పులిచింతల ప్రాజెక్టు సందర్శన కోసం తెలంగాణ సరిహద్దుమీదుగా వెళ్లేందుకు ప్రయత్నించిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభానును సూర్యాపేట జిల్లా బుగ్గమాధవరం వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీ అనుమతితోనే ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నామని ఉదయభాను చెప్పినా అనుమతులు లేవని ఆయనను వెనక్కు పంపారు. దీంతో ఆయన ముక్త్యాల నుంచి కృష్ణానదిలో పడవ మీదుగా ప్రయాణించి గుంటూరుజిల్లా మాదిపాడుకు చేరుకుని అక్కడనుంచి పులిచింతల ప్రాజెక్టుకు చేరుకున్నారు. కాగా, ఉదయభాను పులిచింతల పరిశీలనకు వస్తున్నారనే సమాచారంతో తెలంగాణకు చెందిన పోలీసులు వందల సంఖ్యలో ఆంధ్ర-తెలంగాణా సరిహద్దు బుగ్గమాధవరం, ప్రాజెక్టు వద్ద మోహరించారు. కాగా, ప్రాజెక్టును సందర్శించిన తర్వాత ఉదయభాను మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం నడుచుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటోందని, ఇలాంటి చర్యలను తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ నేతలు మర్యాదగా మాట్లాడాలన్నారు.

Updated Date - 2021-07-12T07:58:56+05:30 IST