ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుల దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-01-20T22:07:20+05:30 IST

ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుల దౌర్జన్యం

ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుల దౌర్జన్యం

అనంతపురం: ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రాయదుర్గం నియోజకవర్గం చదం గ్రామంలోని క్రషర్‌ కంపెనీపై దాడి చేశారు. అడ్డువచ్చిన కార్మికులపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. దాడిలో పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం కాగా కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో కార్మికులు జుమాన్, ఫిరోజ్‌ల పరిస్థితి విషమంగా ఉంది. జరిగిన ఈ ఘటనపై క్రషర్ యజమానురాలు లక్ష్మీదేవి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-01-20T22:07:20+05:30 IST