మంత్రి కేటీఆర్‌తో ఎమ్మెల్యే గంటా భేటీ

ABN , First Publish Date - 2021-03-21T09:38:34+05:30 IST

మంత్రి కేటీఆర్‌తో ఎమ్మెల్యే గంటా భేటీ

మంత్రి కేటీఆర్‌తో ఎమ్మెల్యే గంటా భేటీ

హైదరాబాద్‌, మార్చి 20(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో అసెంబ్లీలో టీ విరామ సమయం లో భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమానికి కేటీఆర్‌ మద్దతు ప్రకటించడంపట్ల గంటా శ్రీనివాస్‌ రావు కృతజ్ఞతలు తెలిపారు.కార్మికులు చేపట్టిన ఉద్యమంలో పాల్గొనేందుకు విశాఖ రావాలని కేటీఆర్‌ను, గంటా ఆహ్వానించారు. దీనిపై ఆలోచించి చెబుతానని కేటీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

Updated Date - 2021-03-21T09:38:34+05:30 IST