‘జగన్ నుంచైనా లెటర్ పెట్టుకో..’ ఎలక్ట్రిసిటీ ఏఈపై ఎమ్మెల్యే తమ్ముడి బూతు పురాణం
ABN , First Publish Date - 2021-02-27T04:00:32+05:30 IST
నందలూరు ఎలక్ట్రిసిటీ ఏఈపై రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున్ రెడ్డి తమ్ముడు బూతులతో విరుచుకుపడ్డాడు. తీవ్రమైన అసభ్య పదజాలంతో ఎలక్ట్రిసిటీ ఏఈని దూషించాడు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మార్చలేదంటూ..

ఇంటర్నెట్ డెస్క్: నందలూరు ఎలక్ట్రిసిటీ ఏఈపై రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున్ రెడ్డి తమ్ముడు బూతులతో విరుచుకుపడ్డాడు. తీవ్రమైన అసభ్య పదజాలంతో ఎలక్ట్రిసిటీ ఏఈని దూషించాడు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మార్చలేదంటూ సురేష్‌పై నోటికొచ్చినట్లు తిట్లతో విరుచుకుపడ్డాడు. ఈ విధంగా తిడితే పోలీసులకు కంప్లైంట్ ఇస్తానంటూ ఏఈ చెప్పినప్పటికీ మరింత రెచ్చిపోయి తిట్ల దండకం అందుకున్నాడు. దీనికి సంబంధించిన ఆడియో ఇప్పుడు ఏబీఎన్ చేతికి చిక్కింది.