స్కూళ్లు యథావిధిగా నడుస్తాయి: మంత్రి సురేష్‌

ABN , First Publish Date - 2021-02-26T23:39:51+05:30 IST

రాష్ట్రంలో మార్చి 1 నుంచి స్కూళ్లు యథావిధిగా నడుస్తాయని మంత్రి ఆది

స్కూళ్లు యథావిధిగా నడుస్తాయి: మంత్రి సురేష్‌

కడప: రాష్ట్రంలో మార్చి 1 నుంచి స్కూళ్లు యథావిధిగా నడుస్తాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. మార్చి 1 నుంచి స్కూళ్లకు సెలవులంటూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తల్లో నిజంలేదని మంత్రి ఆదిమూలపు తెలిపారు. సోషల్ మీడియాలో స్కూళ్ల పై అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్‌ హెచ్చరించారు. స్కూళ్లు యథావిధిగా నడుస్తాయని ఆయన తెలిపారు. జూనియర్‌ కాలేజీలు కూడా షెడ్యూల్‌ ప్రకారమే నడుస్తాయని సురేష్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-02-26T23:39:51+05:30 IST