జగనన్న ఇళ్ల నిర్మాణంపై మంత్రి శ్రీరంగనాథరాజు ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-09-04T01:50:22+05:30 IST
జగనన్న ఇళ్ల నిర్మాణంపై మంత్రి శ్రీరంగనాథరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

గుంటూరు: జగనన్న ఇళ్ల నిర్మాణంపై మంత్రి శ్రీరంగనాథరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఇళ్లకు డబ్బులు ఇస్తుందని చాలా మంది మాట్లాడుతున్నారని, కేంద్రం డబ్బులు ఇస్తే గాల్లో ఇళ్లు కడతారా? అని ప్రశ్నించారు. ఒక్కో ఇంటికి నాలుగైదు లక్షలు ఖర్చు చేసి స్థలం ఇస్తున్నామని తెలిపారు. ఇల్లు కట్టుకోవాలని ఎవరిని బలవంతం చేయడం లేదని, జగనన్న ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కూడా ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇంటి నిర్మాణాలకు 2.50 లక్షలు ఎప్పుడూ ఇవ్వలేదని, ఇళ్ల నిర్మాణాలకు అత్యధికంగా డబ్బులు ఇస్తుంది తమ ప్రభుత్వమేనని రంగనాథరాజు తెలిపారు.