ఓటీఎస్‌పై బలవంతం లేదు: మంత్రి రంగనాథరాజు

ABN , First Publish Date - 2021-12-07T21:29:03+05:30 IST

ఓటీఎస్‌పై బలవంతం లేదని మంత్రి రంగనాథరాజు అన్నారు. ఓటీఎస్‌పై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

ఓటీఎస్‌పై బలవంతం లేదు: మంత్రి రంగనాథరాజు

గుంటూరు: ఓటీఎస్‌పై బలవంతం లేదని మంత్రి రంగనాథరాజు అన్నారు. ఓటీఎస్‌పై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు వడ్డీ కూడా మాఫీ చేయలేదని గుర్తుచేశారు. ఇప్పుడేమో మొత్తం రుణం మాఫీ చేస్తామని అసత్యాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల ద్వారా ఓటీఎస్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దస్తావేజులు కావాలనుకుంటే ఓటీఎస్‌లో డబ్బులు కట్టాలన్నారు. ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకుంటే భూమిపై హక్కు వస్తుందన్నారు. 

Updated Date - 2021-12-07T21:29:03+05:30 IST