బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించిన మంత్రి పేర్నినాని

ABN , First Publish Date - 2021-12-15T19:50:45+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా బస్సు ప్రమాదంపై మంత్రి పేర్నినాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించిన మంత్రి పేర్నినాని

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా బస్సు ప్రమాదంపై మంత్రి పేర్నినాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక అందించాలని ఉన్నధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారని మంత్రి పేర్నినాని వెల్లడించారు. 

Updated Date - 2021-12-15T19:50:45+05:30 IST