రైతుల కోసం బ్యాంకులు: కన్నబాబు
ABN , First Publish Date - 2021-12-15T21:35:58+05:30 IST
రాష్ట్రంలోని రైతుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు
గుంటూరు: రాష్ట్రంలోని రైతుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఏర్పాటు చేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. రైతుల పేరిట రుణాలు పొందితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. పీఏసీఎస్‌లలో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదన్నారు. డ్వాక్రా గ్రూప్‌లకు కో-ఆపరేటివ్ బ్యాంక్‌ల ద్వారా రుణాలు అందిస్తామని ఆయన తెలిపారు.