రాజధానిని విశాఖకు తరలించటం ఖాయం: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2021-08-27T23:53:29+05:30 IST

రాజధానిని విశాఖకు తరలించటం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి

రాజధానిని విశాఖకు తరలించటం ఖాయం: మంత్రి బొత్స

రాజమండ్రి: రాజధానిని విశాఖకు తరలించటం ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. కోర్టులో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కారించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌ల అడ్రస్ ఎక్కడ అని మంత్రి బొత్స ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తున్నామంటూ పక్కరాష్ట్రంలో ఉంటారా అని వారిని మంత్రి బొత్స  ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-08-27T23:53:29+05:30 IST