కారంచేడు వైద్యుడి పరిస్థితిపై ఏబీఎన్ కథనానికి స్పందించిన బాలినేని
ABN , First Publish Date - 2021-06-05T16:25:42+05:30 IST
ప్రకాశం: కారంచేడు వైద్యుడి పరిస్థితిపై ఏబీఎన్ కథనానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి వైద్యుడి వైద్యానికి
ప్రకాశం: కారంచేడు వైద్యుడి పరిస్థితిపై ఏబీఎన్ కథనానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి వైద్యుడి వైద్యానికి రూ.కోటి విడుదల చేయించారు. మరో 50 లక్షల వరకూ ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి బాలినేని హామీ ఇచ్చారు. ఇటీవలే ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యుడు భాస్కర్‌రావు కరోనా బారిన పడ్డారు. కరోనాతో పూర్తిగా ఊపిరితిత్తులు పాడైపోయాయి. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తులు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊపిరితిత్తులను మార్చేందుకు కోటిన్నర వరకూ ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో వైద్యుడు భాస్కర్‌రావు చికిత్స పొందుతున్నారు.