కార్మికులకు అండగా వైసీపీ: మంత్రి అవంతి

ABN , First Publish Date - 2021-02-08T20:44:06+05:30 IST

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కార్మికులకు అండగా ఉంటుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు..

కార్మికులకు అండగా  వైసీపీ: మంత్రి అవంతి

విశాఖ: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కార్మికులకు అండగా ఉంటుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఆవేశంగా మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాల మద్దతు లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు.బీజీపీ వచ్చాక దక్షిణ భారతదేశంలోని రాష్టాలపై వివక్ష చూపిస్తున్నారని మంత్రి అవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని మంత్రి అవంతి చెప్పారు.

Updated Date - 2021-02-08T20:44:06+05:30 IST