సీ ప్లెయిన్స్‌కి అనుమతివ్వండి: మంత్రి అవంతి

ABN , First Publish Date - 2021-11-24T00:42:37+05:30 IST

రాష్ట్రంలో సీ ప్లెయిన్స్‌కి అనుమతివ్వాలని కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డిని

సీ ప్లెయిన్స్‌కి అనుమతివ్వండి: మంత్రి అవంతి

విశాఖ: రాష్ట్రంలో సీ ప్లెయిన్స్‌కి అనుమతివ్వాలని కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ కోరారు.  పోర్టు, టూరిజం శాఖ అధికారులతో నగరంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అవంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బుద్ధి సర్క్యూట్‌లో ప్రత్యేక ట్రైన్‌కి, సీ ప్లెయిన్స్‌కి అనుమతివ్వాలని కోరామన్నారు. రూ.99 కోట్లతో క్రూసిస్‌ టూరిజం నిర్మాణానికి ప్రతిపాదన చేశామన్నారు. ఈ ప్రాజెక్టు 2022 నాటికి పూర్తి అవుతుందన్నారు. అల్లూరి సీతారామరాజు ట్రైబల్ మ్యూజియం పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తారని మంత్రి అవంతి పేర్కొన్నారు. Updated Date - 2021-11-24T00:42:37+05:30 IST