రాష్ట్రంలో 13 ఫైవ్‌‌స్టార్ టూరిజం హోటల్స్

ABN , First Publish Date - 2021-08-28T00:08:45+05:30 IST

ఏపీలోని 13 జిల్లాలలో 13 ఫైవ్‌స్టార్ టూరిజం హోటల్స్ నిర్మించేందుకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారని

రాష్ట్రంలో 13 ఫైవ్‌‌స్టార్ టూరిజం హోటల్స్

కర్నూలు: ఏపీలోని 13 జిల్లాలలో 13 ఫైవ్‌స్టార్ టూరిజం హోటల్స్ నిర్మించేందుకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలోని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను మంత్రి అవంతి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫైవ్‌‌స్టార్ టూరిజం హోటల్స్‌ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. విశాఖపట్నం, తిరుపతిలో ఫైవ్‌స్టార్ హోటల్లు నిర్మించేందుకు అల్‌రెడీ ఒబెరాయ్ వాళ్లు ఒప్పుకున్నారని ఆయన తెలిపారు.


అయితే కరోనా రావడంతో ఇబ్బందులు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. కరోనా వల్లా ఎక్కువగా నష్టపోయింది టూరిజం శాఖేనని ఆయన అన్నారు. కరోన వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు. డిసెంబరు కల్లా కరోనా అదుపులోకి రావాలని, ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోవాలని స్వామి వారిని కోరుకున్నానని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. 

Updated Date - 2021-08-28T00:08:45+05:30 IST