మేం గాజులు తొడుక్కున్నామా?.. చిత్తూరులో పుట్టుంటే రా.. నెల్లూరులో వారం ఉంటా.. దేనికైనా సిద్ధమే: మంత్రి అనిల్‌

ABN , First Publish Date - 2021-10-20T19:06:18+05:30 IST

మంత్రి అనిల్ నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే చూసుకుందాం రమ్మంటూ ప్రతిపక్ష పార్టీ నేతలకు సవాల్ విసిరారు.

మేం గాజులు తొడుక్కున్నామా?.. చిత్తూరులో పుట్టుంటే రా.. నెల్లూరులో వారం ఉంటా.. దేనికైనా సిద్ధమే: మంత్రి అనిల్‌

నెల్లూరు: మంత్రి అనిల్ నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే చూసుకుందాం రమ్మంటూ ప్రతిపక్ష పార్టీ నేతలకు సవాల్ విసిరారు. నేడు నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఎంని తిట్టిస్తే గాజులు తొడుక్కున్నామా? సీఎం జగన్‌రెడ్డి కోసం దేనికైనా సిద్దమే. మీరు చిత్తూరులో పుట్టుంటే రా.. చూసుకుందాం. నెల్లూరులో వారం రోజులు ఉంటా రమ్మను. సీఎంని తిట్టిన విషయం పవన్‌కు గుర్తు లేదా? సీఎం ఫ్యాక్షనిస్ట్‌ అయితే మీరు ఉంటారా? వైసీపీ కార్యకర్తలను ఎవడు తాకుతాడో చూస్తాం. ఎవడొస్తాడో రండిరా.. అవసరమైతే కాన్వాయ్‌ని కూడా పక్కనబెట్టొస్తా’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-20T19:06:18+05:30 IST