ఒకేరోజు లక్షా యాభైవేల ఉద్యోగాలు ఇచ్చాం: మంత్రి అనిల్

ABN , First Publish Date - 2021-10-25T23:21:26+05:30 IST

రాష్ట్రంలో ఒకేరోజు లక్షా యాభైవేల ఉద్యోగాలను ఇచ్చిన ఘనత సీఎం

ఒకేరోజు లక్షా యాభైవేల ఉద్యోగాలు ఇచ్చాం: మంత్రి అనిల్

నెల్లూరు: రాష్ట్రంలో ఒకేరోజు లక్షా యాభైవేల ఉద్యోగాలను ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఆగిపోయాయని డ్రామోజీరావు పత్రికలో తప్పుడు కథనాలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. కులగజ్జితో రామోజీ రావు వార్తలు ఇస్తున్నారన్నారు. రామోజీ రావు దిగజారుడు వార్తలు రాయటం భావ్యం కాదని ఆయన హితవు పలికారు. రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టమంటున్న టీడీపీ ఏ ప్రాజెక్ట్ పూర్తి చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. నీరు చెట్టు పేరుతో వేలకోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో కమీషన్లకు కక్కుర్తి పడటం వల్లే ప్రాజెక్టులకు గ్రహణం పట్టిందన్నారు. ఐదేళ్లలో టీడీపీ వైఫల్యాలు రామోజీరావుకి కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులని కూడా టీడీపీ పూర్తి చేయలేకపోయిందన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఒక్క ప్రాజెక్టుని కూడా ప్రారంభించలేదన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లు నిద్రపోయిందన్నారు. ఎన్నికల ముందు డ్రామాలు వేసిందని ఆయన ఆరోపించారు. జగన్ సీఎం అయిన తర్వాత ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సమగ్ర ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. రాష్ట్రంలో 31 లక్షల మంది పేద మహిళలకు ఇళ్లు కల్పిస్తున్న ప్రభుత్వం తమదని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-10-25T23:21:26+05:30 IST