చంద్రబాబు స్టే బాబు: మంత్రి అనిల్

ABN , First Publish Date - 2021-03-21T18:11:09+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్ర సృష్టించబోతున్నామని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు స్టే బాబు: మంత్రి అనిల్

నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికలో చరిత్ర సృష్టించబోతున్నామని  మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ.. నాలుగు లక్షల మెజార్టీతో తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒక స్టే బాబుగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. తప్పు చేయనివారు స్టేలకు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. విచారణ ఎదుర్కోలేకే స్టే తెచ్చుకున్నారని మంత్రి అనిల్ చెప్పారు. 

Updated Date - 2021-03-21T18:11:09+05:30 IST