పరీక్షల షెడ్యూల్‌పై మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటన ఇదీ..

ABN , First Publish Date - 2021-05-08T20:37:03+05:30 IST

పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తర్వాతే పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు

పరీక్షల షెడ్యూల్‌పై మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటన ఇదీ..

ప్రకాశం : పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తర్వాతే పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. విద్యా సంవత్సరాన్ని కాపాడే విషయంలో మాత్రం ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టమని, అందుకే ఆన్‌లైన్‌లో విద్యాబోధన చేయాలని సూచించామని తెలిపారు. పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందని పేర్కొన్నారు. కరోనా కారణంగానే స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించామని, ఇంటర్ పరీక్షలు కూడా అందుకే వాయిదా వేశామని ఆయన స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు మనోధైర్యం ఇచ్చే బాధ్యత ప్రతిపక్షంపై ఉందా? లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చే విధంగా టీడీపీ ప్రయత్నిస్తోందని, చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు.  

Updated Date - 2021-05-08T20:37:03+05:30 IST