అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు

ABN , First Publish Date - 2021-08-28T04:11:13+05:30 IST

గనుల శాఖలోని లొసుగులను ఉపయోగించుకుని కొందరు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని

అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు

విజ‌య‌వాడ‌: గనుల శాఖలోని లొసుగులను ఉపయోగించుకుని కొందరు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని డైరెక్టర్‌ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ (డిఎంజి)  విజి వెంకటరెడ్డి అన్నారు. ఇబ్ర‌హీంప‌ట్నం డీఎంజీ కార్యాలయంలో మైనింగ్ లీజుదారులు, గనులశాఖ అధికారులతో రెండు రోజుల వర్క్‌షాప్‌ జరిగింది. వర్క్‌షాప్‌‌లో వెంకటరెడ్డి మాట్లాడుతూ గనులశాఖలో ప్రభుత్వం తీసుకున్న నిబంధనలను లీజుదారులు పూర్తిస్ధాయిలో తెలుసుకోవాలన్నారు. గనుల శాఖలో అనేక నిబంధనలను సక్రమంగా అమలు చేయలేకపోవడం, వాటిలోని లొసుగులను ఉపయోగించుకుని కొందరు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-28T04:11:13+05:30 IST