మా గ్రామాలు ఏపీలో విలీనం చేయండి

ABN , First Publish Date - 2021-07-09T08:39:08+05:30 IST

తమను ఏపీలో విలీనం చేయాలంటూ ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లోని విజయనగరం జిల్లా సాలూరు మండలం సంపంగిపాడు సరిహద్దులో ఉన్న ఒడిశా గ్రామాల గిరిజనులు మొరపెట్టుకున్నారు

మా గ్రామాలు ఏపీలో విలీనం చేయండి

ఎమ్మెల్యే రాజన్నదొరకు ఒడిశా గిరిజనుల వినతి


సాలూరు రూరల్‌, జూలై 8: తమను ఏపీలో విలీనం చేయాలంటూ ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లోని విజయనగరం జిల్లా సాలూరు మండలం సంపంగిపాడు సరిహద్దులో ఉన్న ఒడిశా గ్రామాల గిరిజనులు మొరపెట్టుకున్నారు. పాచిపెంట మండలం పి.కోనవలసలో ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పార్వతీపురం ఐటీడీఏ పీవో రోణంకి కూర్మనాథ్‌కు వద్దకు ఒడిశా గిరిజనులు గురువారం పెద్దసంఖ్యలో వచ్చారు. కరిడి, బిట్ర, పిలకబిట్ర, జంగంవలస, అడ్డుబొడ్డవలస, బొర్రమామిడి, బైరిపాడు గ్రామాలు ఏవోబీలో సంపంగిపాడు పక్కనే ఉన్నాయని చెప్పారు. తమకు ఒడిశా ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ, అభివృద్ధి ఫలాలందడం లేదని వాపోయారు. తమ తాతలు తెలుగు వారేనంటూ 1835, 1897 తదితర సంవత్సరాల్లో రాసిన రాగి పట్టాలను ఆధారంగా చూపించారు. అయితే కొదమ పంచాయతీ విషయంలో ఒడిశా చేసిన తప్పును తాము చేయబోమని ఎమ్మెల్యే రాజన్నదొర పేర్కొన్నారు. 



Updated Date - 2021-07-09T08:39:08+05:30 IST