ఆర్థికశాఖ అధికారులతో భేటీపై ఉద్యోగ సంఘాల నేతల ఫైర్

ABN , First Publish Date - 2021-12-30T23:34:49+05:30 IST

ఆర్థికశాఖ అధికారులతో భేటీపై ఉద్యోగ సంఘాల నేతల మండిపడ్డారు. ప్రభుత్వం చర్చల పేరుతో తమను అవమానించిందని

ఆర్థికశాఖ అధికారులతో భేటీపై ఉద్యోగ సంఘాల నేతల ఫైర్

అమరావతి: ఆర్థికశాఖ అధికారులతో భేటీపై ఉద్యోగ సంఘాల నేతల మండిపడ్డారు. ప్రభుత్వం చర్చల పేరుతో తమను అవమానించిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. గత సమావేశానికి, ఇప్పటికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని, అలాంటప్పుడు ఎందుకు పిలిచారంటూ ఉద్యోగసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల్లో పురోగతి ఉంటుందనే హామీ ఇస్తేనే తదుపరి భేటీకి వస్తామని స్పష్టం చేశారు. లేనిపక్షంలో తమను చర్చలకు పిలవొద్దని తెగేసి  చెప్పారు. ఏదైనా నేరుగా సీఎం జగన్‌ భేటీలోనే తేల్చుకుంటామని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. జనవరి 3న స్ట్రగుల్‌ కమిటీ భేటీలో కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగసంఘాలు ప్రకటించాయి.

Updated Date - 2021-12-30T23:34:49+05:30 IST