నేడు ఉద్యోగ సంఘాలతో భేటీ

ABN , First Publish Date - 2021-12-30T08:05:33+05:30 IST

పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. గురువారం సచివాలయంలోని రెండో బ్లాక్‌లో ఉద్యోగ సంఘాలతో ఆర్థికశాఖ అధికారులు సమావేశం నిర్వహించనున్నారు.

నేడు ఉద్యోగ సంఘాలతో భేటీ

చర్చలకు రావాలని ఆహ్వానించిన ఆర్థికశాఖ 

అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. గురువారం సచివాలయంలోని రెండో బ్లాక్‌లో ఉద్యోగ సంఘాలతో ఆర్థికశాఖ అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ పలు ఉద్యోగ సంఘాలకు ఆ శాఖ ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు తెలిసింది. గతంలో జరిగిన ఏ సమావేశంలోనూ పీఆర్సీపై స్పష్టత రాలేదని, కనీసం ఈ సమావేశంలో అయినా ఈ విషయం కొలిక్కి వస్తుందా అని ఉద్యోగ సంఘాల నాయకులు, లక్షలాది మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.

Updated Date - 2021-12-30T08:05:33+05:30 IST