కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్‌లో భారీ కుంభకోణం

ABN , First Publish Date - 2021-10-27T01:53:37+05:30 IST

జిల్లాలోని కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్‌లో భారీ

కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్‌లో భారీ కుంభకోణం

కృష్ణా: జిల్లాలోని కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్‌లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. రెండు కోట్ల విలువ చేసే బియ్యం పక్కదారి పట్టింది. గోడౌన్‌లో స్టాక్‌ ఉన్నట్టుగా చుట్టూ ఏర్పాట్లు చేసారు. బంకర్ల తరహాలో అడ్డు పెట్టి మధ్య ఖాళీ ఉంచిన వైనంపై అధికారులు విస్మయం వ్యక్తం చేసారు. రెండు రోజుల క్రితం అధికారుల తనిఖీల్లో వాస్తవం  నిగ్గుతేలింది. ఇప్పటి వరకు కేసు కట్టకుండా, ఉన్నతాధికారులకు రిపోర్ట్‌ పంపకుండా అధికారులు డ్రామా ఆడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంఎల్ఎస్ గోడౌన్లో 25 వేల బస్తాలు మాయమైనా గుర్తించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పౌరసరఫరాలశాఖ అధికారుల ప్రమేయంపై ఉన్నతాధికారులలు ఆరా తీస్తున్నారు. 


Updated Date - 2021-10-27T01:53:37+05:30 IST