అంగన్‌వాడీల సామూహిక ధర్నా

ABN , First Publish Date - 2021-11-23T09:41:42+05:30 IST

కనీస వేతనం రూ.21 వేలు చెల్లించాలని, తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఏపీ అంగన్‌వాడీ ..

అంగన్‌వాడీల సామూహిక ధర్నా

విజయవాడ సిటీ, నవంబరు 22: కనీస వేతనం రూ.21 వేలు చెల్లించాలని, తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్‌లో సోమవారం సామూహిక ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలందరూ వేలాదిగా తరలివచ్చారు. ధర్నాను ప్రారంభించిన అనంతరం సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ.. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్ల నెరవేర్చాలని, లేకపోతే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీలు కె.ఎ్‌స.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలను  శాసనమండలిలో లేవనెత్తుతామని చెప్పారు. యూనియన్‌ అధ్యక్షురాలు జి.బేబిరాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి కె.సుబ్బరావమ్మ, సీఐటీయూ నేత ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-23T09:41:42+05:30 IST