‘జగన్ చేస్తున్నది రైతు దినోత్సవాలు కాదు’
ABN , First Publish Date - 2021-07-08T21:10:01+05:30 IST
‘జగన్ చేస్తున్నది రైతు దినోత్సవాలు కాదు’

అమరావతి: జగన్ చేస్తున్నది రైతు దినోత్సవాలు కాదని, రైతు దగా దినోత్సవాలని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రైతులకు దక్కాల్సిన కృష్ణా జలాలు సముద్రం పాలవుతున్నందుకు జగన్ రైతు దినోత్సవాలంటున్నాడా? అని ఆయన ప్రశ్నించారు. గిట్టుబాటు ధర, ధరల స్థిరీకరణ నిధి, రైతు భరోసా పేరుతో వారిని ఏటా వంచిస్తున్నందుకు రైతు దినోత్సవం నిర్వహిస్తున్నాడా? అని ప్రశ్నించారు.