నెల్లూరులో 22 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-12-08T13:19:48+05:30 IST

నాయుడుపేటలో రూ. లక్ష విలువ చేసే 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సెబ్‌ సీఐ అరుణకుమారి తెలిపారు. నాయుడుపేట సెబ్‌ కార్యాలయంలో మంగళవారం ఆమె పట్టుబడిన గంజాయి, నిందితుల వివరాలను వెల్లడించారు. నాయుడుపేట -

నెల్లూరులో 22 కిలోల గంజాయి పట్టివేత

నెల్లూరు: నాయుడుపేటలో రూ. లక్ష విలువ చేసే 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సెబ్‌ సీఐ అరుణకుమారి తెలిపారు. నాయుడుపేట సెబ్‌ కార్యాలయంలో మంగళవారం ఆమె పట్టుబడిన గంజాయి, నిందితుల వివరాలను వెల్లడించారు. నాయుడుపేట - జువ్వలపాళెం క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా విశాఖపట్నం నుంచి తిరుపతికి వెళ్లే బస్సును తనిఖీ చేశామన్నారు. అందులో 22 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లుతెలిపారు. అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న విశాఖపట్నంకు చెందిన ఈశ్వర్‌రావు, రాంబాబులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2021-12-08T13:19:48+05:30 IST