AP: పంచలింగాల వద్ద మూడుకిలోల Marijuana పట్టివేత
ABN , First Publish Date - 2021-10-21T12:55:34+05:30 IST
పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనాలు తనిఖీలలో పెద్ద ఎత్తున్న గంజాయిని పట్టుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ గరుడ బస్సులో

కర్నూలు: పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనాలు తనిఖీలలో పెద్ద ఎత్తున్న గంజాయిని పట్టుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ గరుడ బస్సులో పాండిచ్చెరికి చెందిన ఇంటర్ విద్యార్థి అలోప్ వద్ద మూడున్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో సొంత వినియోగానికి హైదరాబాద్కు గంజాయి తీసుకెళ్తున్నట్లు నిందితుడు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.