పీపుల్స్‌వార్‌ వ్యవస్థాపకుడు కేజీ సత్యమూర్తి భార్య మణిమ్మ మృతి

ABN , First Publish Date - 2021-05-02T08:41:15+05:30 IST

ప్రముఖ విప్లవ నాయకులు, పీపుల్స్‌ వార్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు, బహుజన నాయకుడు, సిద్ధాంతకర్త, కవి... కంభం జ్ఞాని సత్యమూర్తి భార్య మణిమ్మ(84) గురువారం రాత్రి గన్నవరంలో కన్నుమూశారు

పీపుల్స్‌వార్‌ వ్యవస్థాపకుడు కేజీ సత్యమూర్తి భార్య మణిమ్మ మృతి

గన్నవరంలో ముగిసిన అంత్యక్రియలు


గన్నవరం, మే 1: ప్రముఖ విప్లవ నాయకులు, పీపుల్స్‌ వార్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు, బహుజన నాయకుడు, సిద్ధాంతకర్త, కవి... కంభం జ్ఞాని సత్యమూర్తి భార్య మణిమ్మ(84) గురువారం రాత్రి గన్నవరంలో కన్నుమూశారు. కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన మణిమ్మ గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు. సత్యమూర్తి విప్లవం కోసం కుటుంబాన్ని వదలి అజ్ఞాతంలో గడిపిన రోజుల్లో మణిమ్మ కుటుంబం బాధ్యతను భుజాన వేసుకున్నారు. వారికి ఇద్దరు ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. పేద దళితురాలిగా ఎన్నో విపత్కర పరిస్థితులను నిబ్బరంగా ఎదుర్కొని నిలబడిన దీశాలీ మణిమ్మ అని సన్నిహితులు పేర్కొంటారు. ఆమె పార్థివదేహాన్ని వామపక్ష నేతలు, రాజకీయ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. 

Updated Date - 2021-05-02T08:41:15+05:30 IST