మంగళగిరిలో కాబట్టి సరిపోయింది.. రాయలసీమలో అయితే ఖూనీలు జరిగేవి: వైసీపీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-21T22:44:57+05:30 IST

మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చేపట్టిన ప్రజాగ్రహ దీక్షలో పాల్లొన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ

మంగళగిరిలో కాబట్టి సరిపోయింది.. రాయలసీమలో అయితే ఖూనీలు జరిగేవి: వైసీపీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు

కడప: మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చేపట్టిన ప్రజాగ్రహ దీక్షలో పాల్లొన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ మంగళగిరిలో కాబట్టి టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు.. అదే రాయలసీమలో అయితే ఖూనీలు జరిగేవని హెచ్చరించారు. టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగితే రాష్ట్ర బంద్ చేస్తారా అని ప్రశ్నించారు. ‘‘ టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా ఈ పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటలు దీక్షకు దిగారు. చంద్రబాబు ఎందుకు దీక్ష చేస్తున్నావు. ఏ కారణంతో దీక్ష చేస్తున్నావు. వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినందుకు దీక్ష చేస్తున్నావా?.. లేకుంటే టీడీపీ నేత పట్టాభి మాట్లాడిన భాష సరియైనదే అని దీక్ష చేస్తున్నావా? చంద్రబాబు నీకు తెలివితేటలు లేవా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు. ప్రతిపక్ష నేతగా ఉన్నావు. పట్టాభి వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటే నీకు గౌరవం పెరిగేది. ఇప్పుడు రాష్ట్రపతి పాలన కావాలని చంద్రబాబు అడుగుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో అనేక హత్యలు జరిగాయి. అప్పుడు మాత్రం రాష్ట్రపతి పాలన అవసరం లేదు. ఈ రోజు ఏం జరిగిందని రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తున్నావు?’’ అని ప్రశ్నించారు.

Updated Date - 2021-10-21T22:44:57+05:30 IST