సాయితేజ కుటుంబానికి మంచు విష్ణు అండ

ABN , First Publish Date - 2021-12-09T22:33:49+05:30 IST

‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఉదారత చాటుకున్నారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌కు వ్యక్తిగత సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్న

సాయితేజ కుటుంబానికి మంచు విష్ణు అండ

చిత్తూరు: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఉదారత చాటుకున్నారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌కు వ్యక్తిగత సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్న బొగ్గుల సాయితేజ(27) ప్రాణాలు కోల్పోయారు. దీంతో సాయితేజ కుటుంబానికి మంచు విష్ణు అండగా నిలిచారు. సాయితేజ ఇద్దరు పిల్లల ఉచిత విద్యకు అందిస్తామని ప్రకటించారు. సాయితేజ కుటుంబీకులను కలిసి ఆర్థికసాయంపై మంచు విష్ణు పీఏ చర్చించారు. సాయితేజ పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు విష్ణు హామీ ఇచ్చినట్టు కుటుంబసభ్యులకు పీఏ తెలిపారు. 


సాయితేజది చిత్తూరు జిల్లా యర్రబలి పంచాయతీ ఎగువరేగడ గ్రామం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన 2013లో ఆర్మీకి ఎంపికయ్యారు. మొదట సిపాయిగా విధులు నిర్వహించారు. అనంతరం అప్రెంటీస్‌ కోర్సు పూర్తిచేసి రక్షణశాఖలో లాన్స్‌ నాయక్‌గా విధుల్లో చేరారు. ఈ క్రమంలో సాయుతేజ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ రావత్‌కు వ్యక్తిగత సెక్యూరిటీ అధికారిగా నియమితులయ్యారు. సాయితేజకు భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞ(5), కుమార్తె దర్శిని(2) ఉన్నారు.

Updated Date - 2021-12-09T22:33:49+05:30 IST