ఆజాదీ కా అమృత్‌ను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2021-08-05T09:09:51+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌(75 వసంతాల స్వాతంత్య్రం) కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా విజయవంతం చేయడంలో అన్ని రాష్ట్రాలూ కీలక పాత్ర పోషించాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబ సూచించారు.

ఆజాదీ కా అమృత్‌ను విజయవంతం చేయండి

రాష్ర్టాలకు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ సూచన

అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌(75 వసంతాల స్వాతంత్య్రం) కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా విజయవంతం చేయడంలో అన్ని రాష్ట్రాలూ కీలక పాత్ర పోషించాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబ సూచించారు. బుధవారం ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ ఏడాది మార్చి 12వ తేదీన గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను రాష్ట్రపతి జెండా ఊపి ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రారంభించారని గుర్తు చేశారు. 

Updated Date - 2021-08-05T09:09:51+05:30 IST