ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారానికి గడువు పెంపు

ABN , First Publish Date - 2021-11-04T08:38:33+05:30 IST

ట్టణాలు, నగరాల్లో లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎ్‌స)లో భాగంగా దరఖాస్తులను పరిష్కరించేందుకు గడువును

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారానికి గడువు పెంపు

అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పట్టణాలు, నగరాల్లో లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎ్‌స)లో భాగంగా దరఖాస్తులను పరిష్కరించేందుకు గడువును వచ్చే ఏడాది మార్చి 31వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను సెప్టెంబరు 30 నాటికి పరిష్కరించాలని మొదట్లో ప్రభుత్వం షెడ్యూల్‌ ఇచ్చింది. అయితే అగ్రిగోల్డ్‌ భూములు అభివృద్ధి చేసి జగనన్న స్మార్ట్‌ టౌన్లుగా తయారు చేయడంతో పాటు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాల్లో టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది నిమగ్నం కావడంతో ఈ దరఖాస్తుల పరిష్కారానికి గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.  

Updated Date - 2021-11-04T08:38:33+05:30 IST