నెల్లూరులో ప్రేమ జంట హల్చల్

ABN , First Publish Date - 2021-12-26T15:03:43+05:30 IST

నెల్లూరులో ప్రేమ జంట హల్చల్ చేసింది. కడప ప్రొద్దుటూరుకు చెందిన నిఖిల్‌రెడ్డి, కోటకు చెందిన సాయిలక్ష్మీ పరారీ..

నెల్లూరులో ప్రేమ జంట హల్చల్

నెల్లూరు: నెల్లూరులో ప్రేమ జంట హల్చల్ చేసింది.  కడప ప్రొద్దుటూరుకు చెందిన నిఖిల్‌రెడ్డి, కోటకు చెందిన సాయిలక్ష్మీ పరారీ అయ్యారు. తమ బిడ్డను నిఖిల్ రెడ్డి స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశాడని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో నిఖిల్‌రెడ్డితో కారులో వచ్చిన వారిని గూడూరు వద్దా అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీ, నిఖిల్‌రెడ్డితో పాటు ఆయన తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-26T15:03:43+05:30 IST