ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

ABN , First Publish Date - 2021-06-22T17:59:50+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా గుండుగోలను-కొవ్వురు రహదారిపై ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు, లారీ డ్రైవర్‌‌లకు బలమైన..

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా గుండుగోలను-కొవ్వురు రహదారిపై ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు, లారీ డ్రైవర్‌‌లకు బలమైన గాయాలయ్యాయి. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న మరో 10 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.


Updated Date - 2021-06-22T17:59:50+05:30 IST