కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనూ కర్ఫ్యూ నిబంధనలను సడలింపు!
ABN , First Publish Date - 2021-07-08T12:30:32+05:30 IST
కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనూ కర్ఫ్యూ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. మొత్తం 11 జిల్లాల్లో16 గంటలపాటు ప్రజా కార్యకలాపాలకు...

అమరావతి: కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనూ కర్ఫ్యూ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. మొత్తం 11 జిల్లాల్లో16 గంటలపాటు ప్రజా కార్యకలాపాలకు అనుమతినిస్తూ వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీచేశారు. కేసులు అదుపులోకిరాని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గతంలో మాదిరిగా 12 గంటలు మాత్రమే ప్రజా కార్యకలాపాలు కొనసాగుతాయని, మిగిలిన 11జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10గంటల వరకు సడలింపులు అమలులో ఉంటాయని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు గురువారం నుంచి ఈ నెల 14 వరకు అమలులో ఉంటాయని తెలిపారు.