లోకేశ్‌కు మ్యాటర్ లేదు.. వాడు దేనికీ పనికిరాడు
ABN , First Publish Date - 2021-10-21T08:28:58+05:30 IST
లోకేశ్‌కు మీటర్, మోటర్, మ్యాటర్ లేదని అన్నారు. వాడు దేనికీ పనికిరాడని, ప్రజలు ఆమోదించరని, చంద్రబాబు తదనంతరం పాలు, పెరుగు అమ్ముకుని బతకాల్సిందేనని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు.

వాడేమో పప్పుగుత్తు అయిపోయాడు: వంశీ
అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): లోకేశ్‌కు మీటర్, మోటర్, మ్యాటర్ లేదని అన్నారు. వాడు దేనికీ పనికిరాడని, ప్రజలు ఆమోదించరని, చంద్రబాబు తదనంతరం పాలు, పెరుగు అమ్ముకుని బతకాల్సిందేనని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో సీఎం జగన్‌కు సంబంధం లేదన్నారు. ‘‘చంద్రబాబు నాయుడు అధికారం పోయిందన్న దుగ్ధతో.. ఇంకో రెండు మూడేళ్లు ఆగలేక, తన కొడుకును ప్రయోజకుడిని చేయలేక... లోకేశ్ అనేవాడు పప్పుగుత్తు అయిపోయాడు... కాబట్టి ఎన్ని జాకీలు, క్రెయిన్లు, రాడ్లు పెట్టి... హైదరాబాద్ నుంచి వార్తలు రాయించి... మా కులపెద్దలందరినీ సమావేశ పరిచి... నా కొడుకును ముఖ్యమంత్రిని చేయండి, నన్ను ప్రధానమంత్రిని చేయండి.. అని ఎన్నికలకు ముందు ఈయన చేసిందంతా చూశాం. ఒక అప్రయోజకుడైనటువంటి కొడుకును, దద్దమ్మను, చవట సన్నాసిని, ట్విటర్‌లో నాలుగు లైన్లు పెట్టేవాడిని పెట్టుకుని చంద్రబాబు ఏమీ చేయలేక... సహనం కోల్పోయి, వయసు అయిపోతాంది... 74 ఏళ్లు వచ్చినాయి... ఇంకో నాలుగేళ్లలో ఐదేళ్లకో చచ్చిపోతాం... నేను చచ్చిపోయేలోపు నా కొడుకుని సీఎం చేయలేకపోతే.. అని ఈ చావు భయంతో ఆయన ఈ పనులన్నీ చేస్తా ఉన్నాడు’’ అని వల్లభనేని వంశీ అన్నారు.